58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
జోగులాంబ గద్వాల 19 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు. ఆదేశాలతో (బుధవారం ) నాడు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థినిలకు ముగ్గుల పోటి కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి. పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ ప్రశంసించారు విద్యార్థులు కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వివిధ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రగతి విద్యానికేతన్ స్కూల్, కాకతీయ టెక్నో స్కూల్, విశ్వేశ్వరయ్య మెమోరియల్ హై స్కూల్, శారద హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, విద్యార్థినీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.