**43వ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు"పాలేరు నియోజకవర్గం ఇన్చార్జి కొండ బాల కర్ణాకర్*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : పాలేరు నియోజకవర్గ తిరుమలాయపాలెం మండల కేంద్రం లో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగానిర్వహించారు
ఈ కార్యక్రమానికి జిల్లా అడహక్ కమిటి సభ్యులు కొండబాల కరుణాకర్ హాజరై జెండా ఆవిష్కరణ చేసారు.
తిరుమలాయపాలెం మండలకేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్యకర్తల ఆనందోత్సవాలతో ఆ గ్రామ కమిటీ ఆధ్వర్యం లో జరిపారు ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహర్లు అర్పించి తెలుగుదేశం జెండా ఆవిష్కరణ చేసారు , ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు 2 రూపాయల కిలోబియ్యం జనతా వస్త్రాలు రైతులకు కరెంట్ చార్జీలు తదితర జనరంజక మైన కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయాల్లో పెద్ద పీట వేసారని పలువురు వక్తలు కొనియాడారు అలాగే జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు , అలాగే యువనాయకులు మంత్రి వర్యులు నారాలోకేష్ బాబు కార్యకర్తల సంక్షమ నిధి పెట్టి కార్యకర్తల ను కాపాడు చున్నారని వారన్నారు
ఈ కార్యక్రమంలో మల్లీడి నాగేశ్వరరావు , తెలుగుయువత జిల్లా నాయకులు మల్లెంపాటి లహరిన్, కేతినేనినరేష్ , ఆళ్లనరసింహరావు, ఆలేటి రంగయ్య , రమావత్ శ్రీనివాస్ , ఉపేందర్ ,లింగంపల్లి వీరన్న, యాకూబ్ గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు