వచ్చెను ఉగాది...

Mar 30, 2025 - 00:21
Mar 30, 2025 - 00:25
 0  7
వచ్చెను  ఉగాది...

చైత్ర మాసపు తొలి ఉషోదయం లో

పాడ్యమి తిథి పసిడి వన్నెలీనగా

 విశ్వమంతా విచ్చిన హరివిల్లు లా

వచ్చెను వసుధలోన శ్రీ విశ్వా వసు నామ 

సంవత్సర ఉగాది.

క్రోధి లోని కోప తాపాలను పక్కకు నెట్టి,

తెచ్చెను సుఖ శాంతులను తన వెంబడి. 

కోకిల కూసెను కుహు కుహు రాగ మాలికలు.

 సిరిమల్లె సువాసన పరిమళాలు వెదజల్లె.

శడ్రుషుల సమ్మేళనం ఉగాది పచ్చడి,

మన బతుకు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.

జీవిత గమనంలో వచ్చే ఆటుపోట్లు చేదు తీపిలై,

సుఖదుఖాలు వగరు కారాలై,

మంచి చెడులు మామిడి పులుపై,

 పచ్చడి రూపంలో మన భాగ్యరేఖను కళ్ళకు కట్టే అద్భుత పండగ ఉగాది.

నిన్న జరిగిన దానికంటే రేపు జరగబోయేది తెలుసుకోవాలనే జిజ్ఞాసా లేనిదెవరికి?

భవిష్య వార మాస రాశి ఫలాల కదలికలో భవిష్యత్ స్థితి ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఖగోళంలో కూడా కాబినెట్ ఉన్నట్లే...

ఫలానా రాష్యాధిపతి ఫలానా అయితే దేశం సశ్య శ్యామలం అయినట్లే, వర్షాలకైనా, హర్షాలకైనా అధిపతులు ఉన్నారంటూ మురిసిపోతాం. 

ఈ రోజు ఒక మంచి పని ప్రారంభిస్తే 

ఇక ఆ సంవత్సరమంతా మంచే జరుగుతదని నమ్మే మట్టి మనుషులం.

పిన్నా పెద్దా అంతా కలిసి  పంచాంగ శ్రవణం చేస్తాం.

అవమాన రాజ పూజ్యం లెక్కలు కట్టి  

ఏడాదంతా సల్లగ సూడుమని దేవునికి మొక్కులు, పొర్లు దండాలు పెడతాం......

ఈ విశ్వా వసు నామ సంవత్సరం లో

రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిద్దాం...

ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆశిద్దాం....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333