పేట బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొంపెల్లి లింగయ్య

మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కలసిన బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
అబినందించి సన్మానించిన మాజీ మంత్రి జగదిష్ డ్డి
సూర్యాపేట, 30 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు పోటా పోటీగా జరుగగా ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా, సీనియర్ న్యాయవాది, సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి లింగయ్య 25 ఓట్ల మేజార్టీతో గెలుపొందారు. అధ్యక్ష పదవి పోటీలో ఉన్న కొంపెల్లి లింగయ్యకు 95ఓట్లు రాగా తన సమీప అభ్యర్థి నూకల సుదర్శన్రెడ్డికి 70ఓట్లు రావడంతో కొంపెల్లి లింగయ్య 25 ఓట్ల మేజార్జీతో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షులుగా గుంటూరు మధు 14ఓట్ల మేజార్టీతో, ప్రధాన కార్యదర్శిగా ఎస్. రాజు 13ఓట్ల మేజార్టీతో, జాయింట్ కార్యదర్శిగా డి. చిన్న వీరప్రసాద్ 39ఓట్ల మేజార్టీతో, కోశాధికారిగా ఎం.డి. లతీఫ్ 22 ఓట్ల మేజార్టీతో, క్రీడలు సాంస్క్రతిక కార్యదర్శిగా డి. వీరేష్కుమార్ 10ఓట్ల మేజార్టీతో గెలుపొందగా గ్రంథాలయ కార్యదర్శిగా ఆర్.యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జె.శ్రీనాద్యదవ్, కె.సరిత, ఎం.లక్ష్మణ్, కె.చంద్రకాంత్, ఎ. సందీప్కుమార్లు గెలుపొందగా వీరి గెలుపును ఎన్నికల అధికారి జి.శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతన కార్యవర్గం రంగులు చల్లుకొని ఆనందం వ్యక్తం చేస్తూ కోర్టు నుంచి భారీ ర్యాలీగా మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకొని మర్యాదపూర్వకంగా మాజీ మంత్రి జగదీష్రెడ్డిని కలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ గెలుపులో కీలక పాత్ర పోషించిన సీనియర్ న్యాయవాదులు నల్లగుంట్ల అయోద్య, గొండ్రాల అశోక్, తలమల్ల హసేన్, నాతి సవిందర్, డపుకు మల్లయ్య, మీలా రమేష్, కాకి రాంరెడ్డిలను అభినందించారు. నూతన బార్ అసోసియేషన్ కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ కమిటీ సభ్యులను ప్రతి ఒక్కరిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చిప్పలపల్లి చిరంజీవి, మీసాల శ్రీను, మోదుగు వెంకట్ రెడ్డి, జిలకర చంద్రమౌళి, డప్పుకు వంశీ, ఊట్కూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.