అన్యాయాలకు, దోపిడీ
వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటమే భగత్ సింగ్ కి ఇచ్చే ఘనమైన నివాళి

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : - అన్యాయాలకు,దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటమే భగత్ సింగ్ కి ఇచ్చే ఘనమైన నివాళి.
-డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్.
- స్వాతంత్ర్య ఉద్యమంలో నిప్పు కణికలు భగత్ సింగ్ సహచరులు.
- యు.టీ.యఫ్ రాష్ట్ర నాయకులు నాగమలేశ్వరరావు.
- మార్చి 23 భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా సదస్సు. (మార్చి 21,2025,ఖమ్మం):సమాజంలో అన్యాయాలకు,దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటమే భగత్ సింగ్ కి ఇచ్చే ఘనమైన నివాళి అన్ని,స్వాతంత్ర్య ఉద్యమంలో నిప్పు కణికలు భగత్ సింగ్ సహచరులు డి.వై.యఫ్.ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల.రమేష్,- యు.టీ.యఫ్ రాష్ట్ర నాయకులు నాగమలేశ్వరరావు లు పిలుపునిచ్చారు.మార్చి 23 భగత్ సింగ్, రాజ్ గురు, సూక్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా యస్.యఫ్.ఐ, డి.వై.యఫ్.ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్మారక వారోత్సవాలలో భాగంగా స్థానిక చిమ్మపుడి హై స్కూల్ లో వర్ధంతి సభను నిర్వహించడం జరిగింది.ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది.ఈ వర్ధంతి సభలో వారు అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ నేటి విద్యార్దులు,యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని,వాటిని అధిగమించి సేవా కార్యక్రమాలు క్రీడా రంగాల్లో ముందుండాలనీ వారు అన్నారు.విద్యార్థులను యువతులను చైతన్యపరచడంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ముందుంటుందని ఆయన అన్నారు.భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులకు నిజమైన నివాళి ఇవ్వడమంటే అవినీతి, మతోన్మాదం డ్రగ్స్, అశ్లీల సినిమాలు,కార్పొరేట్ క్రీడలు, అత్యాచారాలు,యూటీజింగ్,ర్యాగింగ్, మద్యం,విద్య కషాయికరణకు,మతోన్మాదంకి,డ్రక్స్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్దులు,యువకులు పోరాడాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లలిత భవాని గారు మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్దులు మంచి అలవాట్లు, లక్షణాలు నేర్చుకోవాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఉపాధ్యాయులు రజిత, మనోజా, పద్మ, కాశయ్య,యస్.యఫ్.ఐ, డి.వై.యఫ్.ఐ నాయకులు జొనెబోయిన.నవీన్,మనోజ్,లోకేష్,గీతాంజలి,పుష్ప విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.