100 పడకల ఆసుపత్రిలో మొదటి కాన్పు విజయవంతం
జోగులాంబ గద్వాల 4 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి మూడు నెలల క్రితం ప్రారంభమైన నిన్నటిదాకా ఒక కాన్పు కూడా జరగలేదు. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు పురుడోసుకుంది. ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన సంధ్య పండంటి పాపకు జన్మనిచ్చినట్లు స్టాఫ్ నర్స్ లతా తెలిపారు. ఆస్పత్రిలో అనుభవం గల డాక్టర్లు, స్టాఫ్ నర్స్ లు ఉన్నారని గర్భిణీలు నిశ్చింతంగా కాన్పులకు రావచ్చన్నారు నియోజకవర్గ ప్రజలను కోరారు..