హలం పట్టి.. పొలం దున్నిన మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి

Jun 11, 2025 - 21:04
Jun 12, 2025 - 19:16
 0  2
హలం పట్టి.. పొలం దున్నిన మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి
హలం పట్టి.. పొలం దున్నిన మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ హలం పట్టి.. పొలం దున్నిన మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి కష్టాన్ని నమ్ముకున్న కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి* *వ్యవసాయ పనులను ప్రారంభించి, ప్రకృతిని దైవంగా భావిస్తూ, భూమిని పూజించే సంప్రదాయం మన సంస్కృతిలో ప్రత్యేకమైనది.* తొలకరి చినుకులు పడుతుండటంతో సూర్యాపేట జిల్లాలో రైతులు ఉత్సాహంగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎస్) మండలంలోని నెమ్మికల్ లో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి పూజల్లో *వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి గారు* పాల్గొని పాడికి పూజలు చేశారు. అనంతరం నాగలి పట్టి పొలం దున్నారు. విస్తారమైన వర్షాలతో నదులన్నీ నిండి పంట భూముల్లో సిరుల పంటలు పండాలని, రైతన్నల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరవాలని ఆకాంక్షిస్తూ రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపారు.