ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అందరి బాధ్యత

Jun 11, 2025 - 21:01
Jun 12, 2025 - 19:16
 0  4
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అందరి బాధ్యత

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అందరి బాధ్యత ఆత్మకూర్ (s) మండల బాలబాట కో -ఆర్టినేటర్‌ తిప్పర్తి గంగరాజు* ఆత్మకూర్ (s)జూన్‌ 11: మండల కేంద్రంలోని అన్ని గ్రామాల విద్యార్థిని, విద్యార్థులు ప్రయివేట్‌ పాఠశాలాలకు దీటుగా ఉత్తమ ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను పొంది ఉత్తమ ఫలితాలు సాదిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను అందరూ సద్వినియోగం చేసుకోని బలోపేతం చెయ్యాలని బాలబాట ఆత్మకూర్ (s)మండల కోఆర్టినేటర్‌ తిప్పర్తి గంగరాజు కోరారు.మంగళవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి ప్రభుత్వ బడుల్లో గుణాత్మక విద్యను పొందాలని అలాగే బడిఈడు పిల్లల్ని బడిలో అత్యధిక సంఖ్యలో చేర్పించాల్సిన బాధ్యత గ్రామంలో ప్రతి ఒక్క విద్యార్ధిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలపై ఉందని తెలిపారు గ్రామంలోని విద్యార్థులకు మంచి విద్యను పొందేలాగా కృషి చేయాలని గ్రామ ప్రజల, పెద్దల సహకారంతో పాఠశాల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే సామాజిక బాధ్యత మన అందరి పై ఉందని అన్నారు .