రేపు అన్ని జిల్లా కేంద్రాలలో రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల దహనానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మలను రేపు దహనం చేయాలని పిలుపునిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేవంత్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొంది...