స్వాతంత్ర ఉద్యమంలో సేవాదళ్ పాత్ర ఎనలేనిది

Mar 21, 2025 - 09:16
 0  3
స్వాతంత్ర ఉద్యమంలో సేవాదళ్ పాత్ర ఎనలేనిది

స్వాతంత్ర్య ఉద్యమంలో సేవా దళ్ పాత్ర ఎనలేనిది అని సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు ఆలేటి మాణిక్యం, మహిళా అధ్యక్షురాలు శకుంతల రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ శతజయంతి ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని సేవాదళ్ కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. స్వతంత్ర పోరాటంలో సేవాదళ్  ముఖ్య పాత్ర పోషించిందని  ఆయన అన్నారు.స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకుల నియంత్ర్రత్వ , దమనకాండలకు వ్యతిరేకంగా సేవాదళ్ పోరాటం చేసిందని, హిందుస్ధాన్ సేవాదళ్ కు మొదటి అధ్యక్షులు గా పండింట్ జవహర్‌లాల్ నెహ్రూ పనిచేశారని, 1923 లో సేవాదళ్ ను స్ధాపించారని,సేవాదళ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు మేరకు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయనిరాకరణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిందని అన్నారు.సేవాదళ్ ఆనాడు ఇండియన్ ఆర్మిగా పనిచెసిందని అన్నారు. సేవాదళ్ అన్ని మతాలు, ధర్మాలు కలిసిమెలిసి జీవించాలని సేవాదళ్ నిరంతరం దేశ సమైక్యత కోసం పనిచేస్తుందని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి ,సూర్యాపేట నియోజకవర్గం ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆశీస్సులతో సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కి తనవంతు పాత్ర పోషిస్తుందని అన్నారు. పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో ఏనాడు ఇంత ప్రజారంజకమైన బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేదలు, రైతులు, దళితులు, గిరుజనుల సంక్షేమం కోసం పెద్దసంఖ్యలో నిధులు కేటాయించారని, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారని అన్నారు.అసెంబ్లీ లో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దళిత స్పీకర్ పట్ల అసభ్య పదజాలంతో దూషణ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించాలని అన్నారు.సేవాదళ్ కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచంగా వుండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పై బిఆర్ ఎస్, బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సేవాదళ్ నాయకులు తిప్పికొట్టాలని అన్నారు. సేవాదళ్ నాయకులకు తమ సహకారం ఎల్లప్పుడూ వుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు,పిసిసి అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞాన సుందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రుద్రంగి రవి, మకట్ లాల్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేములకొండ పద్మ,ప్రధాన కార్యదర్శి దివ్య, సేవాదళ్ నాయకులు ప్రమీలాదేవి, వెంకట్ రెడ్డి, జ్యోతి, కిరణ్మయి, ప్రసన్న, రేణుక, సేవాదళ్ నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333