స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర ఎంతో గొప్పది 

Jan 30, 2025 - 21:25
Jan 30, 2025 - 21:27
 0  2
స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర ఎంతో గొప్పది 

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  అధ్యక్షుడు జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  పంతంగి వీరస్వామి గౌడ్ . 

 (సూర్యాపేట టౌన్,జనవరి 30):- బ్రిటిష్ పాలకులను  ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి సత్యం అహింస అనే మార్గాన్ని ఎంచుకొని  స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో మహాత్మా గాంధీజీ పాత్ర ఎంతో గొప్పదని జిల్లా సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్   అధ్యక్షుడు తెలంగాణ జై  గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. గురువారం మహాత్మా గాంధీజీ 77 వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని గుర్తు చేశారు. విద్యా యువతను నైతికంగా వ్యక్తిగతంగా  సామాజికంగా  బాధ్యతాయుతమైన  బావి పౌరులుగా తయారు చేస్తుందని గాంధీజీ విశ్వసించేవారు. యువతకు నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా  నిరుద్యోగ సంస్థ పరిష్కరించవచ్చు. శిక్షణ పిల్లల లొ అన్ని సామర్థ్యాలను పెంపొందించలని తద్దోరా విద్యార్థులలు సామాన్య మానవులుగా  మారాలని గాంధీజీ ఆశించారు.  అక్షరాస్యత అనేది విద్యకు ప్రారంభం లేదా ముగింపు కాదు   ఇది శ్రీ లేదా పురుషుడు చేయవలసిన సాధన మాత్రమే అన్నారు. విద్య అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన మీ అంశాలను సామరస్య పూర్వకంగా అభివృద్ధి చేయాలని గాంధీజీ స్వయంగా వివరించారు. విద్యా ముఖ్యమైన లక్షణాల్లో ఒకటి   నైతిక వికాసం లేదా అభివృద్ధి అని కూడా నమ్మాడు. ప్రతి ఒక్కరు గాంధీజీ బాటలో నడవాలని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా గౌరవ సలహాదారులు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు,  ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, సభ్యులు బానోత్ జానీ నాయక్, రాపర్తి సురేష్ గౌడ్ ఆకుల మారయ్య, మండాది గోవర్ధన్ గౌడ్  ఐతగాని మల్లయ్య, పట్టేటి కిరణ్, రమేష్ ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ తాండూర్ సైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333