ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం
మాదిగల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి
టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిర్శనోళ్ల బాలరాజు
సూర్యాపేట: ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల సంక్షేమానికి కృషి చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిర్శనోళ్ల బాలరాజు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రిధికా ఇన్ హోటల్లో టిఎమ్ఆర్పీఎస్ రాష్ట్రస్థాయి భవిష్యత్తు కార్యచరణ సమావేశం టీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ అధ్యక్షతనజరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల గా కేంద్రం ఎస్సీ వర్గీకరణకై పాలకులు అనేక కమిటీలు వేస్తూ కాలయాపన చేసిందని ఇంతవరకు అతీగతి లేదని దుయ్యబట్టారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో మాదిగలకు రెండు ఎంపీ సీట్లు కేటాయించాలని కోరారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం, అభయహస్తం పథకం అమలు చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయ హస్తంపథకం ప్రతి మాదిగకు 12 లక్షల రూపాయలు చేయాలని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. టిఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులుగా చెప్పుకునే తప్పెట్ల శ్రీరాములు సూర్యాపేట జిల్లా కేంద్రానికి పరిమితం అయ్యాడని జాతీయ అధ్యక్షులు అంటే హైదరాబాద్, ఢిల్లీ, వంటి నగరాలకు వెళ్లి మాదిగల హక్కులు, ఎస్సీ వర్గీకరణ సాధనకై పోరాటం చేయాలి కానీ మహిళా జాతీయ అధ్యక్షురాలు నిత్యజీవక్క మరణించిన అనంతరం జాతీయ కమిటీ జాతీయ కమిటీ లేదని ఇటీవల టి ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులపై శ్రీరాములు మాదిగ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టిఎమ్మారిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో మాదిగల హక్కుల సాధనకై పోరాటం చేస్తామని తెలిపారు.ఈ సమావేశంలో టిఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషపంగు సత్యం, రాష్ట్ర నాయకులు కొండగడుపుల సూరయ్య మాదిగ, జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు పాతకోట్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్, సూర్యాపేట నియోజకవర్గ ఇంఛార్జీ పిడమర్తి కమల్, ఆత్మకూరు ఎస్ మండల నాయకులు ములకలపల్లి కోటయ్య, నకిరే కంటి వెంకన్న, రాంబాబు, కత్తి గురవయ్య, బచ్చలకూరి సైదులు, లకపాక నాగరాజు, నర్ర మేరీ, బొల్లె సుమలత, ఎల్లమ్మ, బొల్లె రవీందర్ తదితరులు పాల్గొన్నారు