బండరాళ్లు మీద పడడంతో ఉపాధి హామీ కూలీలు ఇద్దరు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు

Jan 30, 2025 - 19:27
 0  8
బండరాళ్లు మీద పడడంతో ఉపాధి హామీ కూలీలు ఇద్దరు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు
బండరాళ్లు మీద పడడంతో ఉపాధి హామీ కూలీలు ఇద్దరు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు

హుస్నాబాద్ జనవరి 30÷

సిద్దిపేట జిల్లా ఆక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు అధికారుల నిర్లక్ష్యంతో అనుకోని ప్రమాదం జరిగింది రోజులాగే ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు గుంతలు తవ్వకం పనులు చేస్తుండగా ఒక్కసారిగా బండ రాళ్ల మీద పడడంతో ఇద్దరు కూలీలు కందారపు సరోజన 45 సంవత్సరాలు, అన్మాజీ మమత 28 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు. స్వరూప రేణుకలకు తీవ్ర గాయాలయ్యాయి మొగులయ్య ఈసంపల్లి కనకమ్మ బీరయ్య లకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్ లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో గ్రామంలో తీవ్రవిషాదం అలుముకుంది. గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనుల కింద గుట్టచుట్టు గుంతలు తవుతున్నారు ఈ క్రమంలో మట్టి గట్టిగా ఉండడంతో సాయంత్రం నీళ్లు పోసి పొద్దున పనులు చేపడుతున్నారు. అలాగే రోజులాగే గురువారం ఉదయం కూడా ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తుండగా భూమి మెత్తగా ఉండడంతో ఒక్కసారిగా బండరాళ్లు మీద పడ్డాయి దీంతో ఘోర ప్రమాదం జరిగిపోయింది. గ్రామస్తులు వెంటనే చేరుకొని జెసిపి సహాయంతో బండలు తొలగించి చనిపోయిన వారిని బయటికి తీశారు.వెంటనే హుస్నాబాద్ ఏసిపి సిద్దిపేట జిల్లా ఉపాధి హామీ అధికారి డిఆర్ డి ఓ జయదేవ్ మండల అధికారులు స్థానిక ఎస్సై సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం చనిపోయిన వారిని అంబులెన్స్ లో తరలించారు. చనిపోయిన కుటుంబాలకు అంతక్రియల నిమిత్తం మంత్రి పోన్నం ప్రభాకర్ తరుపున ఒక్కొక్కరికి 25 వేల ఆర్థిక సహాయం అందించారు.

ఉపాధి హామీ కూలీలు మరణించడంతో మంత్రి పోన్నం తీవ్ర ద్రిగ్పాంతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుంత తీసే క్రమంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాల పై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఉపాధి హామీ లో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించారు. గాయపడిన మరో ఇద్దరికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. మరణించిన ,గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333