స్వాతంత్రతోద్యమంలో గాంధీజీ పాత్ర ఎంతో గొప్పది 

Oct 2, 2024 - 22:33
Oct 2, 2024 - 22:39
 0  6

సత్యము అహింస అనేవి గాంధీ ఆయుధాలు

మహాత్ముని బాటలో పయనించాలి 

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్

అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ 

(సూర్యాపేట టౌన్ అక్టోబర్ 2 ):-  బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుండి  తరిమికొట్టడానికి జరిగిన స్వాతంత్రోద్యమ పోరాటంలో మహాత్మా గాంధీజీ పాత్ర ఎంతో గొప్పదని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు. బుధవారం మహాత్మా గాంధీ 155 వ ,జయంతిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ లాంటి ఆదర్శమూర్తినీ నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సమాజ స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలనీ చెప్పుకొచ్చారు    గాంధీజీని ఆదర్శంగా తీసుకున్న బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు పని చేయాలన్నారు  ఈ దేశంలో మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే  చదువు ఒక్కటే మార్గం ఆ చదువు అనేది ప్రతి పేదవాడు (అందేలా) చదువుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం అనేది ప్రజలకు ఇవ్వాలి అని పంతంగి వీరస్వామి గౌడ్  అన్నారు. శాంతి సత్యాగ్రహం అహింసలే ఆయుధాలుగా మహాత్మా గాంధీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికారు. గాంధీ జీవితం నిరంతరం త్యాగాల బాట. బాపు మార్గాన్ని అనుసరిస్తూ. నవభారత నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించాడు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు  దేవత్ కిషన్ నాయక్ , జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు , రియల్ ఎస్టేట్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి అయిత గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్  పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న , కార్యదర్శి మంచాల శ్రీనివాస్ పట్టణ కార్యదర్శి బానోత్ జానీ నాయక్, పర్వతం వెంకటేశ్వర్లు,  జల్లి సత్యనారాయణ,  నేతి రవీందర్ ,రాపర్తి జానయ్య  పె గేపురం నరసయ్య, నీలయ్య  సారగండ్లకోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333