సీసీ రోడ్డు పనులు ప్రారంభం
తిరుమలగిరి 07 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామంలోని ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన 25 లక్షల విలువగల సిసి రోడ్డు మరియు డ్రైనేజీ కాలువల పనులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు బాలకృష్ణ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేస్తున్న తుంగతుర్తి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మందుల సామేలు మా గుండెపురి గ్రామానికి సిసి రోడ్డు మరియు డ్రైనేజీ కాలువలకు నిధులు మంజూరు చేయించారు కావున వారికి గుండెపురి గ్రామస్తులంతా కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో డి ఈ ,ఏ ఈ ,కాంట్రాక్టర్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొమ్ము సోమన్న, శేఖర్, నరేష్ ,సత్తయ్య, రమేష్ ,మల్లయ్య ,రంజిత్ ,సన్నీ ,సోమయ్య ,వీరయ్య, శ్రీను, అశోక్ ,సైదులు ,భద్రయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు