సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిన నేలకొండపల్లి టిఆర్ఎస్ నాయకులు

సిఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిన నెలకొండపల్లి మండల కేంద్రం పొట్టి శ్రీరాములు సెంటర్
రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్..
రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నేలకొండపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం
అధికారం కోసం రైతు భరోసా ఎకరానికి రూ 15,000 ఇస్తామని మాయ మాటలు చెప్పి తీరా గద్దెనెక్కక రైతు భరోసాను పక్కనబెట్టి రోజుకో మాట మాట్లడుతూ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్.బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య మాట్లాడుతూ.రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలపై ప్రభుత్వం పై నమ్మకం పోయింది అన్నారు.ఈ కార్యక్రమంలో ఈ నిరసన కార్యక్రమం లో రైతు సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గ్రామ శాఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు