ఉచిత వాటర్ ప్లాంట్ ను ప్రజలు వినియోగించుకోవాలి
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
ఐదవ వార్డ్ లో ఏర్పాటుచేసిన ఉచిత వాటర్ ప్లాంట్ ను ఊరి ప్రజలు వినియోగించుకోవాలని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 5 వ వార్డులో ఉచిత వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి మాట్లాడారు దురాజ్పల్లిలో 5 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మద్దె బోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అని అన్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటి వద్దకు వచ్చే మినరల్ వాటర్ అధిక డబ్బులు వసూలు చేసి వాటర్ పోస్తున్నారని గ్రామ ప్రజలు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత వాటర్ ను ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా ఒక వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మంచి నీరు అందిస్తామని అన్నారు. త్వరలో దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతర ప్రారంభం కాబోతుందని త్వరలో పెద్దలతో మాట్లాడి జాతర ఏ విధంగా జరిపించాలో వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని కాకపోతే గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి సహకరించిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పంతంగి దశరథ, నిఖిల్ నాయుడు, నాగు, మద్దేబోయిన తిరుమలేష్, సునీల్ రెడ్డి,పటాన్ నబీ ఖాన్, పల్స ఉపేందర్, సాగర్ నాయక్, జావిద్, కొత్తపల్లి వెంకన్న, మొండి కత్తి లింగయ్య, నాగుల్ మీరా, తన్నీరు వెంకన్న, ఆలేటి మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.