పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఇసుక ట్రాక్టర్ పల్టీ
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- ఇసుక ట్రాక్టర్ పట్టివేత.* పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో ట్రాక్టర్ను ఫల్టి కొట్టిoచిన డ్రైవర్... ఆత్మకూర్ ఎస్... అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసుల పట్టుకొని స్టేషన్ కు తరలిస్తుండగా తప్పించునేందుకు ఇసుక తో సహ ట్రాక్టర్ ను డ్రైవర్ ఫల్టి కొట్టించిన సంఘటన మండల కేంద్రము లో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతర్ల పహాడ్ గ్రామానికి చెందిన జటంగి ముత్తయ్య ఇసుక అక్రమంగా తరలిస్తుoడ గా బోరింగ్ తండా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడం తో ఇసుక ట్రాక్టర్ ను స్టేషన్ కు మళ్ళించారు. ఇసుక కేసు నుండి తప్పించుకావాలనుకున్న డ్రైవర్ ముత్తయ్య అత్మకూర్ సమీపం లో ని ట్రాక్టర్ ను చాకచక్యం గా ఫల్టి కొట్టించి దూకేశాడు. ఇసుక నేలపాలు కావడమే కాకుండా ట్రాక్టర్ భాగా ద్వంసం అయ్యింది. ఇదే ట్రాక్టర్ గురువారం ఇసుక తరలిస్తుండగా నూతన కల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.ఆత్మకూర్ పోలీసు లు కేసు నమోదు చేసి రెవిన్యూ అధికారులకు పంపినట్లు ఎస్ ఐ సైదులు తెలిపారు. *తీవ్ర స్థాయిలో ఇసుక దందా* మండలంలో ఇసుక దందా తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికారులకు దడ పుట్టిస్తున్న ఈ ఇసుక దందా ను అరికట్టడం లో అధికారుల చెయ్యి దాటి పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు నూతనకల్లో ఆత్మకూరు మండలాల్లో ఇసుక ట్రాక్టర్ల పై కేసులు నమోదు అయినప్పటికీ కేసులు వేయకుండా తిరిగి దందా ను కొనసాగిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఈ ఇసుక దందా పై కఠిన చర్యలు తీసుకోనట్లయితే ఇదంతా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.. అంతర్గతంగా రాజకీయాల అండ కూడా పనిచేస్తుందని విమర్శిస్తున్నాయి...