సిద్దార్థ స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే వేడుకలు

Feb 28, 2025 - 16:49
Feb 28, 2025 - 16:57
 0  159
సిద్దార్థ స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే వేడుకలు
సిద్దార్థ స్కూల్ నందు ఘనంగా సైన్స్ డే వేడుకలు

సైన్స్ ఎగ్జిబిషన్ తో పాటుగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించిన స్కూల్ యాజమాన్యం

సూర్యాపేట, 28 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సిద్దార్థ స్కూల్ నందు జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ లో అనేక అంశాలను ప్రదర్శించారు. సైన్స్, ఇంజనీరింగ్, పర్యావరణం, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రదర్శనలు ఆకట్టుకునే విధంగా వున్నాయి.  ఈ సందర్భంగా స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్, హెడ్ మాస్టర్ మర్రు హనుమంత రావు మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ లు  విద్యార్థులలో దాగివున్న  ప్రతిభ, స్ర్రజనాత్మకత ను వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.  తమ పాఠశాలలో 3 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్దులు సైన్స్ ఎగ్జిబిషన్ నందు అనేక వైజ్ఞానిక, సాంకేతిక అంశాలను సందేశాత్మక అంశాలను ప్రదర్శనలో వుంచారని, పలువురు తల్లిదండ్రులు, విద్యార్ది సంఘాల నాయకులు విచ్చేసి విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారని అన్నారు. పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ నందు దాదాపుగా 100 రకాల వెజ్ టేరియన్  ఫుడ్ ఐటమ్స్ లను విద్యార్థులు తమ ఇంటి వద్ద తయారు చేసి తీసుకుని వచ్చారని, అవి ఎంతో రుచికరంగా వున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333