సుమన్ షాటోకాన్ కరాటే బెల్ట్స్ సర్టిఫికెట్స్ పంపిణీ

Feb 28, 2025 - 17:06
Feb 28, 2025 - 17:08
 0  2
సుమన్ షాటోకాన్ కరాటే బెల్ట్స్ సర్టిఫికెట్స్ పంపిణీ
సుమన్ షాటోకాన్ కరాటే బెల్ట్స్ సర్టిఫికెట్స్ పంపిణీ

హీరో సుమన్, మరియు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 28:- ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమి ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్స్ , సర్టిఫికేట్స్ పంపిణీకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులుబత్తుల లక్ష్మారెడ్డి , మరియు హీరో సుమన్ ,కరాటే నేర్చుకున్న విద్యార్థులకు బెల్ట్స్ మరియు సర్టిఫికేట్స్ అందజేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కరాటే శిక్షణ ద్వారా మనలో ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు శారీరకంగా మానసికంగా చాలా చురుకుగా ఉంటారని అన్నారుముఖ్యంగా ఆడపిల్లకు కరాటే శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆత్మరక్షణ కోసం బాగా సహాయపడుతుంది అనిఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న మాస్టర్స్ కి ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ , డిసిసి వైస్ చైర్మన్ చిలుకూరి బాలు, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, మరియు నాయకులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333