కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
మెదక్ జిల్లా మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ షేక్ మజహర్
(మెదక్ )టేక్మాల్ : తెలంగాణ వార్త ప్రతినిధి :- బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినందుకు కేంద్ర మంత్రిలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గార్లు రాజీనామా చేయాలనీ మెదక్ జిల్లా మైనార్టీ కాంగ్రెస్ చైర్మన్ షేక్ మజహర్ డిమాండ్ చేశారు, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్ఖ గార్లు వెళ్లి ప్రధాన మంత్రి ని, కేంద్ర మంత్రులను కలసిన పట్టించు కోలేదు అని దుయ్య భట్టారు, 8మంది ఎంపీ లు 2కేంద్ర మంత్రులు ఉన్న ఫలితం శూన్యం అని ఆయన అన్నారు, 2ఎంపీ ఉన్న పొరుగు రాష్ట్రము 30,000వేల కోట్లు కేటాయించారు, తెలంగాణ రాష్ట్రము లొ బీజేపీ కి 8ఎంపీ లు 2కేంద్ర మంత్రులను కూడా కేంద్రం పట్టించు కోలేదు అని పేర్కొన్నారు, అందుకే వారు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసారు, బడ్జెట్ విషయం లొ తమతో కలిసి BRS కేంద్రం పై పోరాటం చేయాలన్నారు, రాజకీయ లకు అతీతంగా మోడీ పై యుద్ధం ప్రకటించాలన్నారు.