సిఎం దిస్టి బొమ్మ దగ్ధం. రాస్తారోకో

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి అరిగోసలు పడుతున్న తెలంగాణ రైతాంగం పక్షాన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డిని అక్రమంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందున నిరసనగా శనివారం మండలం లోని అన్ని గ్రామాలలో బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు,ఈ కార్యక్రమాలలో నాయకులు మాట్లాడుతూ సత్వరమే కాలేశ్వర జలాలను ఈ ప్రాంతానికి విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని అలాగే రైతు భరోసా రైతు రుణమాఫీ మరియు వడ్ల బోనస్ ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి వైఖరిని నిరసిస్తూ రాస్తారోకో, సీఎం దిష్టిబొమ్మను దహనంచేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు,pacs చైర్మన్ కొనతం సత్యనారాయణ రెడ్డి, బత్తుల ప్రసాద్, ముద్దం కృష్ణా రెడ్డి, బెల్లంకొండ యాదగిరి,బ్రహ్మం గౌడ్ కోడి రవి,మాజీ సర్పంచ్ రజిత సుధాకర్ మాజీ ఎంపీటీసీ దామీడి మంజుల, షేక్ బషీరుద్దీన్, కానాల మల్లారెడ్డి, మడ్డి రమేష్,గుండు లింగయ్య,సుదగాని పాపయ్య, జలగం గోపాల్ ,తదితరులు పాల్గొన్నారు