సేవే పరమావధిగా..

వృత్తి కానిస్టేబుల్.. ప్రవృత్తి సామాజిక సేవ.
జోగులాంబ గద్వాల 19 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల్:-అన్ని దానాల్లోకెల్ల రక్తదానం గొప్పది.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తం ఎంతో ఉపయోగపడుతుంది. సమాజంలో ఇలాంటి అవసరాలను గుర్తించిన గద్వాల్ మండలంలోని గంజిపేట కాలినికి కు చెందిన శ్రీనివాస్ .. వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయినా ప్రవృత్తి మాత్రం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన్ననలు పొందుతున్నాడు.గద్వాల్ జిల్లా కేంద్రంలో సోమవారం ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ కోసం బాధపడుతున్న గంజిపేట కాలనీ చెందిన స్రవంతి కు డాక్టర్ తగు పరీక్షలు చేసి రక్తం తక్కువ ఉన్నదని చెప్పటంతో కేటి దొడ్డి మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసులు కి సమాచారం అందివ్వటంతో తక్షణమే స్పందించి గద్వాల పట్టణంలోని బ్లడ్ సెంటర్ కు వెళ్లి విషయం తెలుసుకొని ‘ఓ "పాజిటివ్ రక్తం ఇచ్చి డెలివరీ మహిళా స్రవంతి కి పునర్జీవం ఇచ్చారు. పలువురు స్పందిస్తూ బ్లడ్ సెంటర్ లో రక్తం లేకపోవడంతో స్పందించి మానవత్వం చాటుకున్న శ్రీనివాసులు ను పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డెలివరీ మహిళా స్రవంతి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.