మధ్య వద్దంటూ ఊరు కదిలింది
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- మధ్య వద్దంటూ ఊరు కదిలింది బోరింగ్ తండా లో మద్యపాన నిషేధం పై అఖిలపక్ష సమావేశం. మద్యం తాగవద్దు అమ్మ వద్దంటూ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కు గ్రామస్తుల ప్రతిజ్ఞ.... ఆత్మకూర్ ఎస్... ప్రశాంతమైన తండాలలో మద్యం మహామ్మారి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుందని అందుకే మా గ్రామాల్లో మద్యం నిషేధించాలంటూ పల్లెలు నిద్రలేచి ప్రతిజ్ఞలు చేసుకున్నాయి. ఆత్మకూరు మండలంలోని బోరింగ్ తండ లో మంగళ వారం సంపూర్ణ మద్యపాన నిషేధం చేపట్టాలంటే వందలాదిమంది సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మానాలు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. గ్రామంలో మద్యం దుకాణాలు వెంటనే మూసివేయాలని ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇకనుండి గ్రామంలో ఎప్పుడు మద్యం అమ్ముటకాని తాగడం కానీ చేయరాదు అంటూ ప్రతిజ్ఞ చేశారు. బోరింగ్ తండాలో మధ్య విక్రయించిన తాగిన జరిమానాలు విధించబడతాయని తీర్మానాలు చేసుకున్నారు. గ్రామాల్లో మధ్య నిషేధం చేసుకోవడం సంతోషకరమైన శాంతియుతంగా ఉద్యమాలు చేసుకొని గ్రామాల అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. కిరాణా షాపులు మరే విధమైన ప్రాంతాల్లో గుట్కా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయించిన సేవించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని యువకులు సమాచారం ఇవ్వాలంటే కోరారు. ప్రతి రాజకీయ పార్టీల కుల సంఘాల,యువజన సంఘాల నుంచి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మాణం చేశారు. ఈ కార్యక్రమoలో గుగులోతు గణేష్,చాంప్లా,కుమార్, సురేందర్, శ్రీనివాస్,శేఖర్, వీరన్న, ప్రేమ్ కుమార్,నందు పార్వతి,పద్మ,బుజ్జి,చంద్రకళ,కల్పన,మంజుల మండల జేఏసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.