సామాజిక విప్లవ వీరుడు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతికి ఘన నివాళులు అర్పించిన బామ్ సేఫ్ నాయకులు 

Nov 28, 2025 - 19:01
 0  21
సామాజిక విప్లవ వీరుడు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతికి ఘన నివాళులు అర్పించిన బామ్ సేఫ్ నాయకులు 
సామాజిక విప్లవ వీరుడు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతికి ఘన నివాళులు అర్పించిన బామ్ సేఫ్ నాయకులు 

 జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల  ఈరోజు 28/11/2025న గద్వాల జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి బామ్ సేఫ్ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు  బామ్ సేఫ్ గద్వాల జిల్లా అధ్యక్షులు  రామకృష్ణ మాట్లాడుతూ... 19వ శతాబ్దంలో జ్యోతిరావు పూలే సమకాలీన కుల, లింగ వివక్షలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మొత్తం భారత సామాజిక చరిత్రలో ఒక ప్రధాన అధ్యాయంగా నిలిచింది. 1827లో మహారాష్ట్రలో జన్మించిన పూలే విద్యార్థిగా ఉన్నప్పుడు అమెరికా స్వాతంత్ర ఉద్యమం, శివాజీ జీవిత చరిత్ర, థామస్ పెయిన్ రచన మానవుని హక్కులు, జాన్ స్టువర్టు రాసిన స్వా జాన్ స్టువర్టు రాసిన స్వతంత్రం వంటివి ప్రభావితం చేశాయి. పులే జీవితంలో ఒక అసాధారణ సంఘటన, ఆయన భవిష్యత్తు జీవితాన్ని సామాజిక సేవకు అంకితం అయ్యేటట్లుగా మార్చింది. తన బ్రాహ్మణ మిత్రుని ఆహ్వానం మేరకు పెండ్లి ఊరేగింపులో పాల్గొన్నందుకు పూలేను పక్కకు నెట్టివేసి కులం పేరుతో దూషించారు. సూద్రుడివి ఈ ఊరేగింపులో పాల్గొనడానికి ఎంత ధైర్యం? అని అవమానించారు. ఈ అవమానం గురించి తండ్రిని అడగగా పీష్వాల పాలనాలలో ఇది మామూలే అని చెప్పాడు. ఏ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి శూద్రులు విద్యావంతులు అవ్వడం ఒకటే మార్గం అని ఆయన భావించారు. సతీ సగమనం వ్యతిరేకించి భర్త చనిపోయిన స్త్రీలు, అనాధ బాలల పునరావాసానికి అంకిత భవన్ తో పనిచేశాడు. శ్రీ విద్య కోసం పాఠశాలలను ఏర్పాటు చేశాడు. తన భార్య సావిత్రిబాయికి తనే చదువు చెప్పి ఆమెను టీచరుగా తయారు చేసి ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు అని పూలే చరిత్ర తెలియజేశారు.


    ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాంసేఫ్ నాయకులు సిద్ధార్థ కృష్ణ, వీడి భాస్కర్, జయన్న,  వాల్మీకి, సుందర్ రాజు, సురేష్, సాయి సవరన్, రామన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333