భాషా గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలి రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు మధుసూదన్ రెడ్డి
జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మౌలిక భాషా గణిత నైపుణ్యాలను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు మధుసూదన్ రెడ్డిఅన్నారు. ఎర్రవల్లి మండలం పరిధిలోని కొండేరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో రాష్ట్ర పరిశీలకులు శుక్రవారం సందర్శించారు.
* విద్యార్థుల యొక్క విద్య సామర్ధ్యాలను పరిశీలించారు.
* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఒకటవ తరగతి నుండి మూడవ తరగతి ముగిసే నాటికి మౌలిక భాష గణిత నైపుణ్యాలను అభివృద్ధి పరిచి చదవడం రాయడం వంటి ప్రాథమిక భాష నైపుణ్యాలను కూడికలు తీసివేతలు వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలను ప్రతి విద్యార్థికి ప్రాథమిక దశలో అందించి బలమైన పునాది వెయ్యాలన్నారు.