సర్కార్ బడిబాట కార్యక్రమం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రభుత్వ ఉపాధ్యాయుల బడి బాట కార్యక్రమం ఆత్మకూరు ఎస్ మండలం లోని ఏపూర్ గ్రామం లో ఉన్న జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. గ్రామం లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని విద్యార్ధుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో అన్ని సబ్జెక్టు లకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు వున్నారని ఈ సంవత్సరం 10 వ తరగతి లో 37 మంది విద్యార్థులు గాను అందరు మంచి మార్కుల తో ఉత్తీర్ణత సాధించి మండలం లో 2వ స్థానం లో మార్కుతో నిలిచారని దాతల సహకారంతో ప్రతీ రోజూ విద్యార్దులకు స్నాక్స్ ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు బుక్స్ ను ఇస్తుందని పిల్లని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాసిత్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రవి, నగేష్ ,రమణ, పుష్ప కుమారి ,విజయ పాల్గొన్నారు.