నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన""మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ లో తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల
నేలకొండపల్లి లో గత అర్థరాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ లో ఆరబోసిన ధాన్యం కొంతమేర తడిచిపోయింది.దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు తడిచిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు.రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.రైస్ మిల్లులలో కాళీ లేకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం తరలించడం లో కొంత జాప్యం జరిగిందని ఆయన అన్నారు.ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం తో ఆయన ఉన్నత అధికారులతో మాట్లాడి ధాన్యం తరలించేందుకు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.రెండు మూడు రోజుల్లో మార్కెట్ లో కాటాలు వేసిన ధాన్యం మొత్తం మిల్లులకు వెళ్తుందని సీతారాములు చెప్పారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తారని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలోమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్,కాంగ్రెస్జిల్లా నాయకులు కొడాలి గోవింద రావు,నల్లాని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు*