శ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామి దేవస్థానం నందు అన్నదానo

జోగులాంబ గద్వాల 4 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్. మండలం సద్దలోని పల్లి గ్రామంలో శ్రీ స్వయంభు శ్రీకృష్ణ స్వామి దేవస్థా నం నందు ప్రతి అమావాస్య శనివా రం రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మరియు దేవస్థాన చైర్మన్ పురేందర్ ఆధ్వర్యంలో అన్నదాతల నుండి ఈ సౌకర్యాన్ని కల్పిస్తూన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని భావిం చి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగ కుండా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేడు అన్నదాత ఇటిక్యాల మండలo బుడ్డారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ తండ్రి చిన్న సాయన్న స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ సభ్యులు, అర్చకులు కృష్ణయ్య, పాండురంగ స్వామి తదితరులు పాల్గొన్నారు.