తోటి స్నేహితునికి 2009 ఎస్.ఎస్.సి బ్యాచ్ స్నేహితులు ఆర్థిక సహాయం

అడ్డగూడూరు 04 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మిదేవికాల్వ గ్రామంలో శనివారం రోజు2009 10వ తరగతి మిత్రుల ఆధ్వర్యంలో ఇటివలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆకుల హరీష్ తండ్రి ఆకుల యాదయ్యకి ఆపదలో మేమున్నా మంటు ముందుకు వచ్చిన స్నేహితులు వారి సహకారంతో 9వేల రూపాయలు ఆర్దిక సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో స్నేహితులు ఆకుల భిక్షం,బండీ మహేష్, బండి శ్రావణ్,బండి రమేష్,చిగుళ్ళ మహేష్, గుంజ గణేష్,పనుమటి చంటి,బొమ్మ గాని సతీష్,చెట్టిపెల్లి ప్రవీణ్, పనుమటి నరేష్, పనుమటీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.