ప్రజావాణి పిర్యాదులను పోలీస్ అధికారుల సమక్షంలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్

May 12, 2025 - 19:47
 0  13
ప్రజావాణి పిర్యాదులను పోలీస్ అధికారుల సమక్షంలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్
ప్రజావాణి పిర్యాదులను పోలీస్ అధికారుల సమక్షంలో పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్

జోగులాంబ గద్వాల 12 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ  ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపిఎస్  అన్నారు.  సోమవారం  జిల్లా పోలీస్  కార్యాలయం లో ప్రజావాణి కార్యక్రమంలో బాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 9 అర్జీలను జిల్లా ఎస్పీ డి.ఎస్పీ మొగిలయ్య, గద్వాల్, ఆలంపూర్, శాంతి నగర్ సర్కిల్ అధికారుల సమక్షంలో స్వీకరించి  పరిశీలించారు. 

  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ  పిర్యాదుదారులకు బరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని  పోలీస్ స్టేషన్ SHO లను, పోలీస్ అధికారులను  ఎస్పీ  ఆదేశించారు. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో
వడ్డీకి డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని -02 ఫిర్యాదులు.
భూ వివాదాలకు సంబంధించి -02 ఫిర్యాదులు 
హోటల్ ను కూల్చాడని -01 ఫిర్యాదు.
ఇతర అంశాలకు సంబంధించి -04 ఫిర్యాదులు రావడం జరిగిందని పిఆర్ఓ ఆఫీస్ నుంచి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333