శాంతియుత పట్టణం మనందరి బాధ్యత.

Apr 17, 2025 - 00:56
Apr 17, 2025 - 00:59
 0  7
శాంతియుత పట్టణం మనందరి బాధ్యత.

*శాంతియుత పట్టణం మనందరి బాధ్యత*...

*ఏఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి*

పట్టణాన్ని శాంతియుతంగా ఉంచడం మనందరి బాధ్యతని ఏఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి అన్నారు.బుధవారం రాత్రి సూర్యాపేట కేంద్రం తాళ్లగడ్డలో పట్టణ పోలీసుల అధ్వర్యంలో ఎస్పి నర్సింహా ఆదేశాల మేరకు పోలీసు ప్రజా భరోసా కార్యక్రమ నిర్వహించారు.ఈ సందర్బంగా ఏఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు పౌరులు చట్టాల పై అవగాహన కలిగి చట్టానికి లోబడి నడుచుకోవాలి అన్నారు ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నేరాలకు పాల్పడితే జైలు శిక్షలు తప్పవు అన్నారు.ప్రతి ఒక్కరూ చట్టాన్ని వినయోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వీర రాఘువులు, ఎస్ ఐ ఏడుకొండలు, ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ కర్ణాకర్,కృష్ణ, సాగర్ రెడ్డి,మేగ్య, స్థానిక నాయకులు సిరివెల్లి శబరి,కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్న,రాపర్తి శ్రీనివాస్,ఆనంద్, విద్యార్థులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333