వ్యాసరచన పోటీల్లో మెరిసిన శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE స్కూల్ విద్యార్థులు
అభినందించిన పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి.
డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి...!.
కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి.
జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఇటిక్యాల మండలం చాగపురం గ్రామం ప్రభుత్వ పాఠశాల నందు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో మెరిసిన విద్యార్థులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం పై విద్యార్థులకు అవగాహన కల్పించే విధానంలో ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండల ఎంఈవో ల అధ్యక్షతన నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు గెలుపొందడం జరిగినది.
* జూనియర్ వ్యాసరచన పోటీల్లో తనుమై శ్రీ D/o శ్రీనివాసులు 7వ తరగతి మొదటి బహుమతి గెలుపొందింది.
* ద్వితీయ బహుమతి హర్షిత రెడ్డి D/o వెంకటేశ్వర్ రెడ్డి 7వ తరగతి గెలుపొందడం జరిగినది.
* సీనియర్ వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి ఎం.డి.సోహెల్ 9వ తరగతి.
* ద్వితీయ బహుమతి మహేష్ చంద్ర 8వ తరగతి గెలుపొందడం జరిగినది.
భారత రాజ్యాంగంపై వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి అభినందించడం జరిగినది.
చిన్నారులకు చదువుతోపాటు భారత రాజ్యాంగం పై అవగాహన కల్పించే విధానంలో వ్యాసరచన పోటీల్లో గెలుపొందడం అన్నది గొప్ప విశేషమని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలియపరిచారు.