నేరాల నియంత్రణలో భాగంగా విస్తృతంగా వాహనాలు తనిఖీలు - రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్
గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్ ఎస్ఐ సిహెచ్ శ్రీకాంత్ అండ్ సిబ్బంది
జోగులాంబ గద్వాల1 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతి నిధి : గద్వాల్ నేరాల నియంత్రణలో భాగంగా గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు గద్వాల రూల్ ఎస్ఐ సిహెచ్. శ్రీకాంత్ మరియు వారి సిబ్బంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు నేరాల నియంత్రణలో భాగంగా వాహనాలు ను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నామని సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వాహనాల తనిఖీలలో భాగంగా రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ తో పాటు ASI వెంకటేశ్వర్ రెడ్డి వారి సిబ్బంది ఉన్నారు.