వ్యాపారస్తుల్లో కనిపించని బి సి బంద్
జోగులాంబ గద్వాల18 అక్టోబర్ 2025అక్టోబర్ తెలంగాణ వార్తా ప్రతినిధి:- మున్సిపాలిటీ కేంద్రంలో వ్యాపారస్తులు బీసీ బందుకు సహకరించడం లేదు. అఖిలపక్షం నాయకులు, కుల సంఘాలు, బీసీ నాయకులు, రాజకీయ నాయకులు, ప్రతి ఒక్కరు కలిసికట్టుగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలంటూ బీసీ బందుకు పిలుపునిచ్చిన సహకరిస్తామంటూనే వ్యాపారస్తులు వారు షాపులు మూయకుండా వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. బీసీ వర్గ వ్యాపారస్తులకు షాపులు 90% ఉన్న వారి బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా వారి పని వాళ్లు చేసుకుంటున్నారు. ఎవరో పోరాటాలు చేసి ఎవరో బీసీ రిజర్వేషన్లు తెచ్చి పెడితే రిజర్వేషన్లు అనుభవిస్తారు కానీ ఇలాంటి వాటికి సహకరించడం లేదంటూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఇకనుంచి అయినా బీసీ ప్రజలు బీసీ సంఘాల నాయకులకు సహకరించి వారి బిడ్డల భవిష్యత్తుకు పునాదులు వేయాలంటూ ప్రజలు కోరుతున్నారు.