కంటి పరీక్ష కోసం క్యూలైన్ లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి

భద్రాద్రి కొత్తగూడెం 18 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నేటి రాజకీయ నాయకులారా ఒక్క సారి ఈ ఎమ్మెల్యేని చూసారా..ప్రజా క్షేత్రంలో ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కంటి పరీక్షల కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా.. అదే ఒరవడి సాగిస్తున్నారు.సైకిల్‌పై వెళ్లడం,ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వ సాధారణంగా కనిపిస్తాయి.ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు.అక్కడ అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి..తన వరస వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు.ఈ రోజులలో వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పిటిసిలే హంగూ ఆర్భాటాలతో ఆస్తులు అంతస్తులు కార్లు,విశాలమైన ప్యాలెస్లు,మంది మార్బలంతో సొంత సెక్యూరిటీ మధ్యలో జీవనం సాగిస్తుంటారు.కాని ఏకదటిగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు పార్టీ సిద్ధాంతాల ప్రకారం పేద బీద వాడి లాగానే వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు. ప్రజల ఓట్లతో గెలిచి ఆస్తులు అంతస్తులు ఈ రోజులలో రాజకీయ నాయకులు ప్రజల సేవ తక్కువ..వారి లబ్ధి ముందు తరాల కోసం చేసే పనులు ఎక్కువగా ఉంటున్నాయని పలు విమర్శలు ప్రజలలో మనసులలో గుసగుసలు వినిపిస్తున్నాయి..