అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణం

తిరుమలగిరి 19 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ తో బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతుగా తుంగతుర్తి నియోజకవర్గ తిరుమలగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో పాటు, బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ, బీఎస్పీ డిఎస్పి సిపిఐ సిపిఎం ఎమ్మార్పీఎస్ ప్రజా సంఘాలు వ్యాపారస్థులు,చిరు వ్యాపారస్థులు, అన్ని వర్గాల ప్రజలు ఈ బంద్ కి మద్దతు ఇచ్చి పాల్గొని బంద్ ను విజయవంతం చేయడం జరిగింది తదనంతరం తిరుమలగిరి చౌరస్తా లో మహనీయులు మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి అనంతరం వామపక్ష పార్టీలు కలిసికట్టుగా బందులో పాల్గొని ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీపై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్ల అమలును అమలు చేయకుండా, డ్రామాలు ఆడుతోందని వారు విమర్శించారు.తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి నాయకత్వంలో చట్ట సభల్లో బిల్లును ఆమోదించి, ఆర్డినెన్స్ కూడా జారీ చేసినట్లు తెలిపారు.గవర్నర్ ఒక్క సంతకం పెట్టి ఉంటే ఈ సమస్యే ఉండేది కాదు. కానీ, బిల్లును ఆపాలనే కుట్రతోనే దానిని కేంద్రానికి పంపారని ఆరోపించారు.ఒకవైపు చట్టపరంగా అడ్డంకులు సృష్టిస్తూ వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వారు విమర్శించారు.ఈ నిరసన కార్యక్రమంలో. చెవిటి వెంకన్న యాదవ్ ఎల్సోజు నరేష్ మాజీ ఎంపీపీలు కొత్తగట్టు మల్లయ్య, కొమ్మినేని సతీష్ కుమార్, తన్నీరు రామ్ ప్రభు, కందుకూరి లక్ష్మయ్య బత్తుల శ్రీనివాస్ గిలకత్తుల రాము గౌడ్, ఏమోజు రవీందర్,కందుకూరి ప్రవీణ్, తుమ్మ చంద్రమౌళి, వై దీన దయాల్, చేను శ్రీనివాస్, ఏమొజు మధుచారి, పసునూరి శ్రీనివాస్,అడ్డబొట్టు చారి, కష్టమా చారి, చింతకింది సోమనారాయణ, వంగరి బ్రహ్మం, ముద్దంగుల యాదగిరి, బర్ల సోమేష్, పులిమామిడి సోమన్న, పులిమామిడి బిక్షం, పులిమామిడి వెంకన్న, దుస్స రామ్మూర్తి, సోమ నరసయ్య, గాదరబోయిన లింగయ్య యాదవ్, చింతకాయల సుధాకర్, శీలం ఉపేందర్ గౌడ్, సోమయాచారి, బిక్షమాచారి, వైట్ల మురళి, బాలకృష్ణ, రూపాని వెంకన్న, గూడూరు వెంకన్న, సోమేష్, తదితరులు పాల్గొన్నారు....