విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన మండల వ్యవసాయ అధికారి దివ్య సస్పెన్షన్

Sep 9, 2025 - 20:59
Sep 11, 2025 - 19:53
 0  2

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆత్మకూరు(ఎస్) మండల వ్యవసాయ అధికారి దివ్య సస్పెన్షన్ క్షేత్రస్థాయిలో యూరియా సరఫరా లో సరైన పర్యవేక్షణ చేయనందుకుగాను సూర్యపేట జిల్లా, ఆత్మకూరు(ఎస్) మండల వ్యవసాయ అధికారి దివ్యను విధుల నుండి సస్పెన్షన్ చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు మండలం నెమ్మికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు యూరియా సరఫరా చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ అమ్మకాలకు, భౌతిక అమ్మకాలకు తేడాలు వచ్చాయి. ఈ విషయం రైతులతో అయోమయానికి ,గందరగోళానికి దారి తీసింది. దీనివల్ల రైతులకు తప్పుడు సమాచారం వెళ్లాడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ యూరియా సరఫరాను సక్రమంగా పర్యవేక్షణ చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినందుకుగాను ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి దివ్య ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. యూరియా పంపిణీలో నిర్లక్ష్యం వహించిన, అక్రమాలకు పాల్పడిన సహించేది లేదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.