పిల్లలమర్రి పినవీరభద్ర కళాపీఠం సూర్యాపేట వారు పుస్తకాల బహుకరణ

Sep 9, 2025 - 21:14
Sep 11, 2025 - 19:53
 0  8
పిల్లలమర్రి పినవీరభద్ర కళాపీఠం సూర్యాపేట వారు పుస్తకాల బహుకరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : పిల్లలమర్రి పినవీరభద్ర కళాపీఠం సూర్యాపేట వారు పుస్తకాల బహుకరణ *గ్రంథాలయ పుస్తక పఠన నైపుణ్యం అలవరచుకోవాలి* మండల విద్యాధికారి పాతులోత్ ధారాసింగ్ గారు ఆత్మకూర్ మండలం ఏనుబాముల ఉన్నత పాఠశాలకు సూర్యాపేటలోని పిల్లలమర్రి పిన వీరభద్ర కళాపీఠం వ్యవస్థాపకులు,కవి, రచయిత,తెలుగు భాషోపాధ్యాయులు శీల అవిలేను గారు 60 పుస్తకాలను బహుమానంగా అందించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండల విద్యాధికారి పాతులోత్ ధారాసింగ్ గారు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థిని,విద్యార్థులు పాఠశాలలోని,గ్రామాల్లోని గ్రంథాలయాలలోని పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలను విద్యార్థులు తెలుసుకొని భవిష్యత్తులో తెలుగు సాహిత్య రంగంలో కవులు,రచయితలుగా ఎదగాలని ఆకాంక్షించారు.పుస్తకాలు అందజేసిన శీల అవిలేను గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఫోన్,సోషల్ మీడియాకు దూరంగా విద్యార్థులు ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. అనంతరం ఈ పాఠశాలలో గత నెల 29వ తారీఖున తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రతిభా పరీక్షలో గెలుపొందిన విద్యార్థులు ధారవత్ పవన్,బాణోత్ బిందు,గంపల హర్షవర్ధన్,వల్లమల్ల భార్గవిలకు ప్రశంసా పత్రాలు, పుస్తకాలను బహుమానంగా అందించారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా,గ్రంథాలయ పుస్తకాలను పాఠశాలకు తీసుకురావడంలో కృషిచేసిన తెలుగు ఉపాధ్యాయుడు దేవరాజు గారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భరణీ కుమార్, శ్రీనివాస్,ఝాన్సీ, మహాలక్ష్మీ,వెంకన్న,నాగరాజు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.