మల్లన్న దేవుడి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గట్టికల్ లో మల్లన్న దేవుడి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని గట్టికల్లు శ్రీ లింగమంతుల స్వామి ఆలయం లో గత ఏడాది ప్రతిష్టించిన మల్లన్న దేవుడు, కేతమ్మ ,మేడలమ్మ, గంగాదేవి, చౌడమ్మ, ఎలమంచమ్మ విగ్రహాల కు ఆదివారం ప్రధమ వార్షికోత్సవం ఉత్సవాలు నిర్వహించారు.యాదవుల ఆరాధ్య దైవం ఆయిన లింగమంతుల స్వామి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది యాదవులు మండలి, బయ్య, ఏర్పుల, వంశాల వారు ఈ విగ్రహాల నుప్రతిష్టించారు. ఆదివారం తెల్ల వారు జామున బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. విగ్రహాలు ప్రతిష్టించిన వారు ఇంటికో బోనం సమర్పించి బేరీలు, ఈర్ణం చప్పుళ్ళ తో ఉత్సాహంగా నిర్వహించారు.