విద్యుత్ షాక్ తో గేదె మృతి

అడ్డగూడూరు13 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామంలో అండెం నర్సిరెడ్డి తండ్రి రాంరెడ్డి అనే రైతు బర్రె రోజువారి మాదిరిగానే మేత కోసం సోమవారం రోజున వెళ్లి ప్రమాదావశత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన సంఘటన రేపాక గ్రామంలో చోటుచేసుకుంది.మొన్నటికి మొన్న జానకిపురం గ్రామంలో జరిగిన సంఘటన మరువకముందే.. రేపాక గ్రామంలో మృత్యువాత పడ్డ బర్రె విలువ 90 వేల రూపాయలు ఉంటుందని బాధిత రైతు అన్నారు.రోజుకు ఒక ఊర్లో ట్రాన్స్ఫార్మర్ మధ్యలో రక్షణ కవచం లేక వివిధ గ్రామాలలో మూగజీవాలు మృతి చెందుతున్న..విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్ఫారాలు ఉన్నచోట మూగజీవాలు లోనికి వెళ్లకుండా రక్షణ వలయాలు ఏర్పాటు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం రైతుకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు,గ్రామస్తులు కోరుతున్నారు.