వనపర్తి ఐకాన్ చుట్టూ ఫ్లెక్సీలు

Aug 28, 2024 - 22:01
 0  2
వనపర్తి ఐకాన్ చుట్టూ ఫ్లెక్సీలు
వనపర్తి ఐకాన్ చుట్టూ ఫ్లెక్సీలు
వనపర్తి ఐకాన్ చుట్టూ ఫ్లెక్సీలు
వనపర్తి ఐకాన్ చుట్టూ ఫ్లెక్సీలు

 ఇబ్బడి ముబ్బడిగా వాహనాల పార్కింగ్. నిద్రపోతున్న అధికారులు

పట్టించుకోని పాలకులు. నందిమల్ల.అశోక్ జిల్లా మీడియా కన్వీనర్.

5ఏండ్లు అవకాశం,అధికారం ఇస్తే గౌరవ నిరంజన్ రెడ్డి గారు వనపర్తి జిల్లా కేంద్రాన్ని  ఆకాశాన్ని తాకే అభివృద్ధి చేసారు. కనీవినీ ఎరుగని రీతిలో రోడ్ల విస్తరణ.  శిధిలమైన చెరువుల సుందరీకరణ.

 ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఏకో పార్కుతో పాటు రోడ్ల వెంట గ్రీనరీ,అన్ని పార్కుల అభివృద్ధి. ఈ విధంగా పట్టణాన్ని చాల సుందరంగా తీర్చిదిద్దిన ఘనత నిరంజన్ రెడ్డి గారిది ఇందులో భాగంగానే.... పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పట్టణ అభివృద్ధికి ఐకాన్ గా నిలిచేవిధంగా శివాజీ విగ్రహం,సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం వనపర్తి సమాచారాన్ని తెలియజేసే విధంగా వీడియో ప్రదర్శన రాత్రి పూట జిగేల్ మనే విధంగా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో వ్యక్తిగత,వ్యాపార ఫ్లెక్సీలు పెడుతున్నారు. అదేవిధంగా ఇబ్బడి ముబ్బడిగా వాహనాల పార్కింగ్ చేస్తున్నారు. చిరు వ్యాపారస్తులు వ్యాపారం నిర్వహించుకుంటూ రద్దీగా చేస్తున్నారు.  కాబట్టి అధికారులు,ప్రజా ప్రతినిధులు ఈ ప్రదేశంలో ఏటువంటి ఫ్లెక్సీలుగాని,పార్కింగ్ గాని,వ్యాపారాలు గాని చేయకుండా చర్యలు తీసుకొని ఈ ఐకాన్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.  అధికారులకు,పాలకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే అభివృద్ధి దేవుడెరుగు కానీ.....  చేసిన అభివృద్ధిని కాపాడండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333