అమరవీరుల త్యాగాల ఫలితమే మన దేశానికి స్వాతంత్రం 

Aug 15, 2025 - 19:24
 0  10
అమరవీరుల త్యాగాల ఫలితమే మన దేశానికి స్వాతంత్రం 

 భారత ప్రజల స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రతీక స్వాతంత్ర దినోత్సవం 

 సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ 

 (సూర్యాపేట టౌన్ ఆగస్టు 15) : ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే మన దేశానికి స్వాతంత్రం అని భారత ప్రజల స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి ప్రతీక స్వాతంత్ర దినోత్సవం అని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించి విలేకరులతో మాట్లాడారు. గాంధీ మహాత్ముడు బాలగంగాధర్ తిలక్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరో మహనీయులు   తెల్లదొరల పాలనకు చరమగీతం పాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన భారతమాత స్వేచ్ఛ వాయువులను పిలిచింది. అని అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో అలుపెరుగాక పోరాడిన సమరయోధుల కష్టాజితమే బ్రిటిష్ వారిని ఎదుర్కొని ప్రాణాలను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం సంపాదించారు అని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. ఇక నాటి నుంచి నేటి వరకు భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుంది అన్నారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం వికసిత్ భారత్ అంటే భారత దేశ అభివృద్ధి 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన  ఏటా భారత దేశ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చరిత్ర ఆత్మకు ఎర్రకోట పైన దేశ ప్రధాని నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ రియల్ ఎస్టేట్ ఉపాధ్యక్షుడు పట్టేటి కిరణ్  జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ రియల్ రియల్ ఎస్టేట్ పట్టణ కార్యదర్శి అయితగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్, పట్టణ గౌరవ సలహాదారుడు  మాదిరెడ్డి  గోపాల్ రెడ్డి వెంకటరెడ్డి, సారగండ్ల కోటేష్, తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333