లక్ష్మీదేవికాల్వ గ్రామంలో 20 కుటుంబాలు ఎర్ర జెండా పార్టీలో చేరిక జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
అడ్డగూడూరు 07 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మండలంలోని వివిధ గ్రామంలో పున ప్రారంభించిన సిపిఎం పార్టీ గ్రామశాఖలు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అడ్డగుడూరు మండల పరిధిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో నూతనంగా 20 కుటుంబాలు సిపిఎం పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా నూతనంగా గ్రామ శాఖను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లక్ష్మీదేవికాల్వ గ్రామ సిపిఎం శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా బండి లక్ష్మీనరసింహస్వామిని ఎన్నుకోవడం జరిగింది.
ఈ శాఖ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యం.డి జహంగీర్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ సమావేశాన్ని ఉదేశించి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు అయిన కూడా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ అలవికని హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్ని అన్నారు.రాష్ట్రంలో రైతులకు యూరియా కొరతతో నిరంతరం ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసి చూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప రైతులకు సరిపోను యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్రమోదీ ప్రభుత్వం కులాలు,మతాల మధ్య పంచాయితీలు పెడుతూ రాష్ట్రలను విడదీస్తున్నారు తప్ప రాష్ట్రల ప్రయోజనాలను కపడకుండా కాలయాపన చేస్తున్నారు అన్ని అన్నారు.అదే విధంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాలరాజు మాట్లాడుతూ.. గతంలో లక్ష్మీదేవికాల్వ గ్రామంలో సిపిఎం పార్టీ బలమైన ఉద్యమాలు చేసే అనేకసార్లు సర్పంచ్ గా పోటీ చేసి గెలిచిన సందర్భంగా గ్రామంలో గతంలో సిపిఎం పార్టీ అధికార పార్టీలకు బలంగా దీటుగా ఉండేదని అలాంటి పూర్వ వైభవం మల్ల వచ్చిందని అన్నారు. ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక ఎన్నికలలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటూ సిపిఎం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని విధానాన్ని కృషి చేస్తామని అదేవిధంగా ప్రజలు కూడా సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి,గుండు వెంకటనర్సు,సీపీఎం అడ్డగుడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్,చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్,సీపీఎం సీనియర్ నాయకులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు, పార్టీలో చేరినా సభ్యులు ఆకుల సోమల్లు,భీమనబోయిన భద్రయ్య,పనుమాటి నాగయ్య,ఆకుల సత్యనారాయణ,ఆనంతుల సోమయ్య,మామిడ్ల నర్సయ్య,బండి యాదయ్య,బోమగని వీరయ్య,పొన్నాల నర్సయ్య,ఆకుల సోమల్లు,చెరుకు యాకుబ్,చింత లచయ్య తదితరులు పాల్గొన్నారు.