చెక్కులు అందజేసిన మందుల కిరణ్
తిరుమలగిరి 22 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండలం బండపల్లి గ్రామానికి చెందిన లకావత్ అరుణ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ దృష్టికి తీసుకువెళ్లగా చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రెండు లక్షల 50 వేల ఎల్ఓసి చెక్కును బుధవారం నాడు ఎమ్మెల్యే తనయుడు మందుల సూర్య కిరణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలకు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు నిరుపేదలకు వైద్య సహాయం అందించేందుకు బాధితులకు ఆర్దిక సహాయాన్ని వెంటనే మంజూరు చేస్తున్నారని ఆయన చెప్పారు.