రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు జిల్లా ఎస్పీ
హెల్మెట్ లేకుండా ప్రయాణించడం...
మద్యం సేవించి వాహనాలు నడపడం...
సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం
సెల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం...
అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి...
భద్రత నియమాలు పాటించాలి ఎస్పీ నరసింహ..
తిరుమలగిరి 04 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తొండ వెలిశాల ఫాతిమా స్కూల్ మరియు నాగారం మండలంలోని ఫణిగిరి నుండి నాగారం మధ్యలో మరియు జాజిరెడ్డిగూడెం మండలంలో అడివేముల మరియు తిమ్మాపురం లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వివిధ మండలంలోని తరచుగా ప్రమాదాలు జరుగు ప్రదేశాలను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయుటకు తగిన సూచనలను చేసిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు కూడలి లోఉన్న రోడ్లను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ ను నియంత్రించాలని అలాగే ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, నేషనల్ హైవే అధికారుల కు మరియు మున్సిపల్ అధికారులు కు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులకు సహకరించాలని అన్నారు, వారి వెంట డిఎస్పి ప్రసన్నకుమార్ నాగారం సిఐ నాగేశ్వరరావు తిరుమలగిరి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు తో పాటు నేషనల్ హైవే అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ అన్వర్ అలీ ఎస్బి సుధాకర్ ఉన్నారు