అధిక వడ్డీ వసూలు చేస్తూ లోన్ తీసుకున్న ప్రజల నడ్డి విరుస్తున్న ఫైవ్ స్టార్ ఫైనాన్స్

Nov 4, 2025 - 18:41
 0  1
అధిక వడ్డీ వసూలు చేస్తూ లోన్ తీసుకున్న ప్రజల నడ్డి విరుస్తున్న ఫైవ్ స్టార్ ఫైనాన్స్

 ???? కిస్తీ కట్టకుంటే ఇంటికి వెళ్లి రౌడీల లాగా దాడి చేస్తూ లోన్ తీసుకున్న వారి ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు

 జోగులాంబ గద్వాల జిల్లాలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్  అధిక వడ్డీ వేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఒక నెల కిస్తీ కట్టకుంటే లోన్ తీసుకున్న వారి ఇంటికి నాలుగు, ఐదు మంది వెళ్లి రౌడీలు లాగా బిహేవియర్ చేసి చుట్టుపక్కల ఆ లోన్ తీసుకున్న వ్యక్తి మర్యాదను తీస్తున్నారు,బూతులు మాట్లాడుతున్నారు దాడులకు పాల్పడుతున్నారు, ఇంతకుముందు క్యాతురులో అదేవిధంగా వేటాడి వెంటాడడంతో  అబ్బాయి వీళ్ళ అరాచకాలకు గురై పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకొని చనిపోవడం జరిగింది, ఫైవ్ స్టార్ ఫైనాన్స్ మీద జిల్లా ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి,, ఏజెంట్లు ఆగడాలు లోన్ తీసుకున్న వారి మర్యాదలు తీస్తూ  వారు ఆత్మహత్యలకు కారణమవుతున్నారు  ఆర్.బి.ఐ ఆదేశాలు పాటించకుండగా అక్రమంగా తన ఇష్టానుసారంగా ప్రజల దగ్గర అధిక వడ్డీ వేసి వాళ్ళ ప్రాణాలకు కారణమవుతున్నారు,,,ఫైవ్ స్టార్ ఫైనాన్స్లో లోన్ తీసుకుంటే ఇంకా టార్చర్ టెన్షన్ తట్టుకోలేక చనిపోతున్నారు ఇబ్బందులు పడుతున్నారు  ఏదైనా లోన్ తీసుకున్న వ్యక్తి మూడు నెలల వరకు లోన్ కిస్తీ కట్టకుండా ఉండిన నోటీసు పంపించాలి ఆ తర్వాత కోర్ట్ నుండి సూట్ వేసుకోవాలి ఆలా కాకుండా డైరెక్ట్ గా నేరుగా ఇంటికి వచ్చి దాడి చేస్తున్నారు ఇది ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నది

 కావున జిల్లా ఎస్పీ గారు చట్టపరమైన చర్యలు ఫైవ్ స్టార్ ఫైనాన్స్ మీద తీసుకోవాలని మనవి

         ఇట్లు 

 ఫైవ్ స్టార్ ఫైనాన్స్ లో లోన్ తీసుకున్న బాధితులు 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333