రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు

ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలను సూచిస్తున్న సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం.
సూర్యాపేట 15 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఆటోలను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం హెచ్చరించారు. సూర్యాపేటలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ ఎస్సై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆటోలు, మినీ టాటా ఏసీ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. హైవేలో వెళ్లేటప్పుడు యూటర్న్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆటోలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారంఅందించాలన్నారు..ప్రజలకు ఇబ్బంది కలిగించే అకతాయిలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రైవర్లంతా డ్రైవింగ్ లైసెన్స్-ఆర్‌సీ ఉంచుకోవాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు