రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి

Mar 18, 2025 - 19:21
Mar 18, 2025 - 19:25
 0  7
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి

తెలంగాణ వార్త మడుగులపల్లి మార్చి18 :-

 సీపీఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్.

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని సీపీఎం మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీపీఎం ప్రజా పోరుబాటలో భాగంగా మాడ్గులపల్లి మండలం తోపుచర్లలో మంగళ వారం నాడు ఇంటింటికి సర్వే నిర్వహించి వారి కుటుంబ సమస్యల అధ్యయనంతో పాటుగా స్థానిక సమస్యలను అధ్యయనం చేయడం జరుగుతుంది అన్నారు.సర్వేలో భాగంగా అనేక‌ మంది చిన్న,సన్నకారు రైతులకు రైతు భరోసా నిధులు జమ కాకపోవడం వల్ల పెట్టుబడులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఇప్పటివరకు రెండు సీజన్ లకు సంబంధించి రైతు భరోసా డబ్బులు పడలేదన్నారు. కనీసం ఒక కారు నిధులు కూడా పూర్తి స్థాయిలో రైతు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.గ్రామంలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని మరియు చాలా మందికి పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.అదే విధంగా ఇంటింటికి సర్వేలో భాగంగా రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం డీవైఎఫ్ఐ ప్రజా సంఘాల సభ్యత్వాలు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ భాగస్వాములు కావాలని సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శ్రీను,నాయకులు కేసాని లక్ష్మయ్య,మునగాల నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333