గౌరవ డాక్టరేట్ స్వీకరించిన డాక్టర్ దైద వెంకన్నకు ఆత్మీయ సన్మానం
గౌరవ డాక్టరేట్ స్వీకరించిన డాక్టర్ దైద వెంకన్నకు ఆత్మీయ సన్మానం
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు-కందుకూరి యాదగిరి.
ఇటీవల అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ టాక్సెస్ వారిచే గౌరవ డాక్టరేట్ అవార్డును అందుకున్న సూర్యాపేటకు చెందిన ప్రముఖ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక నిర్వాహకులు దైద వెంకన్నకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ కార్యాలయం నందు మంగళవారం ఆత్మీయ సన్మానం చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సేవా తత్పరులు సామాజిక కార్యకర్త డాక్టర్ దైద వెంకన్న వివిధ సామాజిక సాహిత్య కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినందుకు సామాజిక సేవా విభాగంలో గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ సన్మానం చేసి స్వీట్లు పంచుకున్నారు.వెంకన్న ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇంతకంటే ఉన్నతమైన స్థాయికి ఎదగాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకన్నకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు రాష్ట్ర సహాయ కార్యదర్శి చిలుకల చిరంజీవి ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి సైదయ్య సూర్యాపేట జిల్లా కోశాధికారి లంకపల్లి రమేష్ తదితరులు పాల్గొని శాలువాతో ఘనంగా సన్మానించారు